నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలంలోని చిత్తలూరు గ్రామంలో బుధవారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గిరగాని నరేశ్ (30) ట్రాక్టర్ ట్రాలీ బేరింగ్ మార్చుతున్న సమయంలో జాకీ సాయంతో ట్రాలీని ఎత్తాడు. బేరింగ్ అమర్చుతుండగా ట్రాలీ పడి నరేశ్ అక్కడికక్కడే మృతి చెందాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.