సూర్యాపేటలో అంజన పూరీ కాలనీ సమీపంలో గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానిక వివరాల మేరకు. అంజన పురీ కాలనీ నుండి సూర్యాపేట వైపు వెళ్తున్న ఆటోను వెనుక నుంచి కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆటోలో ఉన్న డ్రైవర్ కి తీవ్ర గాయాలైనాయి. స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. గాయపడ్డ వ్యక్తి కాసింపేటకు చెందిన సైదులుగా స్థానికులు గుర్తించారు. కార్ డ్రైవర్ పారిపోయాడు.
పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.