సూర్యాపేట జిల్లా చివ్వేంల మండలం బండమీది చందుపట్ల గ్రామంలో సోమవారం బీఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్ నాయకులు గాయం శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ 134వ జయంతి సభకు ముఖ్యఅతిథిగా పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ కేయ్యల సైదులు, మాజీ ఎంపీటీసీ పిల్లి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.