సోమవారం ‘భూభారతి’ పోర్టల్‌ని ప్రారంభించనున్నారు. భూ వివాదాలను పరిష్కరించడానికి గత ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ధరణి’ స్థానంలో సీఎం రేవంత్ భూ భారతిని తీసుకొచ్చారు. ఇది జూన్ 2 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలులోకి రానుండగా సాగర్, తిరుమలగిరి, కీసర మండలాల్లో సోమవారం నుంచి పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయనున్నారు. అలాగే ధరణిలో జరిగిన అవకతవకలపై త్వరలో ఆడిట్ వేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.