తల్లిపాల ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరికి తెలియజేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. గురువారం సూర్యాపేట కలెక్టర్ ఛాంబర్ లో పోషణ అభియాన్ లో భాగంగా తల్లిపాల వారోత్సవాల పోస్టర్ ని ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా మహిళ శిశు వికలాంగుల మరియు వయో వృద్ధుల సంక్షేమం వారి ఆధ్వర్యంలో ఆగస్టు1 2024 నుండి 7ఆగస్టు 2024 వరకు తల్లిపాల వారోత్సవములు నిర్వహించనున్నారు.