రక్తదానం మరొకరి జీవితానికి వెలుగని డాక్టర్ నరేష్ మామిడి అన్నారు. డాక్టర్స్ డే సందర్భంగా ఆదివారం సూర్యాపేట ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి వద్ద స్థానిక వెన్నెల ఆసుపత్రి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. రక్తదానం ఇచ్చిన దాతలకు 6నెలల వరకు వెన్నెల ఆసుపత్రి లో ఓపి ఫీజు ఉండదని తెలిపారు. అత్యవసరం సమయంలో చిన్న పిల్లలు, గర్భిణీ స్త్రీలు రక్తహీనతతో బాధపడుతున్నప్పుడు రక్తదానం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.