సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా పని చేస్తున్న హమీద్ హుస్సేన్ బుధవారం ఉద్యోగ విరమణ పొందారు. ఈ సందర్భంగా హెడ్ కానిస్టేబుల్ ని వారి కుటుంబ సభ్యుల, స్నేహితుల సమక్షంలో జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ సన్మానించారు. హమీద్ ఉస్సెన్ కి వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగ విరమణ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పోలీసులు అధికారులు పాల్గొన్నారు.