రాష్ట్ర మైనార్టీల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో
గ్రూప్1 మెయిన్స్ కు మైనార్టీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి జగదీశ్ రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. శిక్షణకు హాజరయ్యే అభ్యర్థులు ఈనెల 22 వరకు హైదరాబాదులోని ఆ శాఖ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. అవకాశాన్ని అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.