తెలంగాణ సాయుధ పోరాట సమరయోధుడు, భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం దున్నేవానికి భూమి కావాలని సాగిన పోరులో అగ్రభాగాన నిలిచిన కాచం కృష్ణమూర్తి ఆశయ సాధనకై పోరాడాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ములకలపల్లి రాములు, మట్టి పల్లి సైదులు పిలుపునిచ్చారు. సూర్యాపేటలో గురువారం కాచం కృష్ణమూర్తి 18వ వర్ధంతి వేడుకలు నిర్వహించారు.