అధ్యయనం , అధ్యాపనం, సామాజిక స్పృహ లక్ష్యాలతో ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ప్రభుత్వ విద్యా రంగ పరిరక్షణకు కృషి చేస్తుందని టీఎస్ యుటిఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు పి శ్రీనివాసరెడ్డి, జిల్లా కార్యదర్శి ఎన్ నాగేశ్వరరావులు అన్నారు. ఆదివారం కోదాడలో టీఎస్ యుటిఎఫ్ 11వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా యుటిఎఫ్ పథకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. సంఘం బలోపేతానికి సభ్యులు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో డివిజన్ బాధ్యులు ఉన్నారు.