సూర్యాపేట జిల్లా నూతనకల్ మండల కేంద్రంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నాగం సుధాకర్ రెడ్డి జన్మదిన వేడుకలు గురువారం రాత్రి ఘనంగా నిర్వహించారు. వివిధ గ్రామాల నుండి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున హాజరై మండల కేంద్రంలోని ప్రధాన రహదారులపై డీజే చప్పులతో బాణాసంచా కాలుస్తూ అభిమానులు సంబరాలు నిర్వహించారు. జన్మదిన పురస్కరించుకొని వివిధ సామాజిక కార్యక్రమాలు నిర్వహించారు.