కుట్టు శిక్షణతో మహిళలు స్వయం ఉపాధి పొందవచ్చని లయన్స్ క్లబ్ రీజినల్ చైర్ పర్సన్ గండూరి కృపాకర్, లయన్స్ క్లబ్ ఆఫ్ స్పూర్తి అధ్యక్షురాలు బీరవోలు హైమావతి అన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ స్పూర్తి ఆధ్వర్యంలో శనివారం స్థానిక విద్యానగర్లో నిర్వహించిన ఉచిత కుట్టు శిక్షణ కేంద్రంలో శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు కుట్టు శిక్షణ సర్టిఫికెట్లు అందజేసి మాట్లాడారు.