సూర్యాపేట మండలం బాలెంల సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల డిగ్రీ కళాశాల విద్యార్థినులు కలక్టరేట్ లో బుధవారం ధర్నా చేశారు. కళాశాలలో మద్యం బాటిల్లు అడ్డంగా దొరికిన కళాశాల ప్రిన్సిపాల్ శైలజని సస్పెండ్ చెయ్యకుండా ట్రాన్సఫర్ చేసి అధికారులు చేతులు దులుపుకున్నారని ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ కి చేరుకొని విద్యార్థినులు ఆందోళన చేశారు.