సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఖమ్మం క్రాస్ రోడ్ వద్ద ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, మందుల సామేల్, సంఘ నాయకులు జిల్లా కలెక్టర్ తేజస్వి నంద్ లాల్ పవార్, జిల్లా ఎస్పీ నరసింహలు సోమవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ రచన కమిటీ అధ్యక్షుడిగా ఉంటూ రాజ్యాంగంలో హక్కులు కల్పించారన్నారు.