అగ్ని ప్రమాదాల పట్ల అవగాహన కల్పించాలని జాయింట్ కలెక్టర్ రాంబాబు అన్నారు. సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఫైర్ స్టేషన్ లో అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా వాల్ పోస్టర్ ఆవిష్కరించి మాట్లాడారు. అగ్ని నివారణ పట్ల అవగాహన పెంచుదాం సురక్షిత భారతాన్ని నిర్మిద్దాం అనే నినాదంతో ఏప్రిల్ 14 నుండి 20 వరకు వారం రోజుల పాటు జన సమూహం ఉండే ప్రాంతాలలో అగ్ని ప్రమాద నివారణ పద్ధతులపై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలు చేయాలన్నారు.