బాణామతి వస్తుందనే నెపంతో కొడుకు కోడలు తల్లి దండ్రులను ఇంటి నుంచి వెళ్లగొట్టిన సంఘంటంన ఆత్మకూర్ ఎస్ మండలం కందగట్ల గ్రామంలో జరిగింది. భాదితులు అర్రూరు నరసయ్య, భార్య అర్రూరు అనసూర్య లు మాట్లాడుతూ కందగట్లలో వేరే నివాసం ఉంటున్నప్పటికీ ఉండొద్దని కొట్టి వెల్లగొట్టారని వృద్ద దంపతులు కన్నీరు మున్నీరయ్యారు. కొడుకు కోడలి పై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని ఆర్డీవో వేణుమాధవ్ కు వినతిపత్రం అందజేశారు.