ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు తేమ 17% ఉండేలా తాలు లేకుండా నాణ్యమైన ధాన్యం తీసుకురావాలని డిఎంసి (డిస్టిక్ట్ మిషన్ కో-ఆర్డినేటర్) రేణుక అన్నారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రం ఒకటో వార్డులో ఐకెపి కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు. ప్రతి రైతు మద్దతు ధర 2320కు పై బోనస్ 300 పొందాలన్నారు. నిర్వాహకులు రైతులకు మౌలిక వసతులు కల్పించాలని సూచించారు