సూర్యాపేట జిల్లా కేంద్రంలో రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు, బీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కుతుందని, అయితే ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ముందుందని అన్నారు.