సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ పవర్ 2025మార్చి లో జరిగిన పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో మండలంలో మొదటి స్థానం పొందిన విద్యార్థులకు బుధవారం అభినందన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు విద్యార్థులను తీసుకొని మధ్యాహ్నం 2 గంటల వరకు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కు హాజరు కావాలని కోరారు.