తెలంగాణ కాంగ్రెస్ మహిళ రాష్ట్ర ఉపాధ్యక్షురాలుగా సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన ఒకటవ వార్డు కౌన్సిలర్ వేములకొండ పద్మ నియామకం అయ్యారు. శుక్రవారం హైదరాబాదులోని గాంధీభవన్లో జరిగిన సమావేశంలో తెలంగాణ మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు మొగిలి సునీతా రావు ప్రకటించారు. అనంతరం హైదరాబాదులోని మాజీ మంత్రి, దామోదర్ రెడ్డి నివాసంలో ఆయన చేతుల మీదుగా నియామక పత్రం అందుకున్నట్లు తెలిపారు.