ప్రభుత్వ సంక్షేమ హాస్టల్స్ నందు విద్యార్థుల ఆరోగ్యానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ తేజాస్ నంద్ లాల్ పవార్ అన్నారు. గురువారం సూర్యాపేట ఐడిఓసి సమావేశ మందిరం నందు జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఫ్రీ పోస్ట్ మెట్రిక్యులేషన్ హాస్టల్స్ సంక్షేమ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. వసతి గృహాల సంక్షేమ అధికారులు స్థానికంగా ఉంటూ ప్రతి రోజు హాస్టల్స్ ను పరిశుభ్రంగా ఉంచాలన్నారు.