9న దేశవ్యాప్త సమ్మెలో భాగంగా సూర్యాపేట జిల్లా మధ్యాహ్న భోజన కార్మికులు సమ్మెలో భాగస్వాములు అవుతున్నట్లు నోటీసు ఇచ్చినట్లు డీఈఓ అశోక్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కాగా ఆరోజు విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఇబ్బందులు కలగకుండా ప్రధానోపాధ్యాయులు ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసుకోవాలన్నారు. మండలాల ఎంఈఓలు వదిన ఏర్పాట్లను పర్యవేక్షించాలని సూచించారు.