సూర్యాపేట: అన్ని గ్రామాలలో ఉపాధి హామీ పనులు ప్రారంభించాలి

82చూసినవారు
సూర్యాపేట: అన్ని గ్రామాలలో ఉపాధి హామీ పనులు ప్రారంభించాలి
సూర్యాపేట జిల్లా చివ్వేంల మండల కేంద్రంలోని మంగళవారం ఉదయం ఎంపీడీవోకి వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా గ్రామీణ పేదల సంఘం జిల్లా కార్యదర్శి కొనకంచి వీరభద్రయ్య మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాలలో ఉపాధి హామీ కూలీల కుటుంబానికి 150 రోజులు పని దినాలు కల్పించాలన్నారు. కొన్ని గ్రామాలలో ఇప్పటి వరకు పని కల్పించకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. దీంతో ఎంపీడీవోకి వినతి పత్రం అందచేశారు.

సంబంధిత పోస్ట్