సూర్యాపేట వ్యవసాయ మార్కెట్లో మద్దతు ధర రాలేదని ధాన్యరాశికి రైతు నిప్పు పెట్టాడు. ఆరుకాలం కష్టపడి పండించిన పంటకు కనీస మద్దతు ధర రావట్లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మునగాల మండలం రేపాల గ్రామానికి చెందిన రైతు బత్తుల లింగరాజు వ్యవసాయ మార్కెట్‌కు 70 బస్తాల ధాన్యం తీసుకు రాగా. క్వింటాల్‌కు రూ. 1600 ధర పలుకుతుందనే ఆవేదనతో ధాన్యానికి నిప్పంటించి బోరున విలపించాడు.