సూర్యాపేటలోని శ్రీ సంతోశి మాత ఆలయంలో త్రయోదశి సందర్భంగా నందీశ్వరుడికి ప్రత్యేక పంచామృతాలతో మహా రుద్రాభిషేకం పూజలు ఘనంగా జరిపినట్లు శ్రీ సంతోషిమాత దేవాలయం ప్రధాన కార్యదర్శి బ్రాహ్మ0డ్లపల్లి మురళీధర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్చకులు భట్టారం వంశీకృష్ణ శర్మ మాట్లాడుతూ త్రయోదశి రోజున నందీశ్వరునికి మహారుద్రభిషేకం చేసుకోవడం వల్ల సంతానం లేని దంపతులకు సంతానం, శివుని అనుగ్రహం కలుగుతుందని తెలిపారు.