సూర్యాపేట జిల్లా కేంద్రంలో రెండు అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ల విలీన సభ సంధర్బంగా బుధ వారం కళాకారులు భారీ ప్రదర్శన నిర్వహించారు. పట్టణంలోని ప్రధాన రహదారి గుండా సుమారు రెండు గంటల పాటు కళాకారుల నృత్య ప్రదర్శన పట్టణవాసులకు ఆకట్టుకుంది. డప్పు కళాకారులు , కోలాట బృందాలు పలు కూడళ్లలో చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. అనంతరం కళాబృందాలు సభా స్థలికి తరలి వెళ్లాయి.