కేంద్రం బడ్జెట్ కేటాయింపులో కార్మిక, కర్షకులకు, మొండి చెయ్యి చూపి బడా కార్పొరేట్ శక్తులకు భరోసానిచ్చిందని ఏఐటీయూసీ జిల్లా గౌరవ అధ్యక్షులు దంతాల రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం సూర్యా పేట లో జిల్లా కేంద్రంలో సిపిఐ కార్యాలయం లో రిక్షా కార్మికుల యూనియన్ సమా వేశంలోమాట్లాడారు. బడ్జెట్ కార్మిక, రైతు, పేద వర్గాలకు అన్యాయం చేసేలా ఉందని విమర్శించారు. వ్యవసాయ అభివృద్ధికి తగిన కేటాయింపులు జరపలేదన్నారు.