బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ అని, రాష్ట్ర అధికార ప్రతినిధి చకిలం రాజేశ్వరరావు అన్నారు. సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో పట్టణ అధ్యక్షులు అంజద్ అలీ, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కక్కిరేణి శ్రీనివాస్, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ఎలిమినేటి అభినయ్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి సందర్భంగా వారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.