మనల్ని మనం రక్షించుకోవడానికి కరాటే ఎంతో అవసరం అని ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, టిపిసిసి సభ్యులు పబ్లిక్ క్లబ్ కార్యదర్శి కొప్పుల వేణారెడ్డి అన్నారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో స్థానిక బేబీ మూన్ స్కూల్లో సుమన్ షోటోఖాన్ స్పోర్ట్స్ కరాటే డు అకాడమిక్ ఇండియా ఆధ్వర్యంలో కరాటే శిక్షణ పొందిన వారికి ఎల్లో బెల్ట్ 20, ఆరెంజ్ బెల్ట్ 20, గ్రీన్ బెల్ట్ 8, బ్లూ బెల్ట్ 2, పర్పుల్ బెల్ట్ 1, సర్టిఫికెట్స్ అందజేశారు.