సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ మండలంలో విషాదం చోటుచేసుకుంది. చీదెళ్ల గ్రామంలో శనివారం ఓ వ్యక్తి కలుపు నివారణ మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఏఎస్సై రాములు వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన వెన్న వెంకటరెడ్డి (58) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దీంతో జీవితంపై విరక్తి చెంది కలుపు నివారణ మందు తాగాడు. కుటుంబీకులు వెంటనే సూర్యాపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ వెంకట రెడ్డి మృతి చెందాడు.