ఎస్సీ, ఎస్టీల సమస్యల పరిష్కారంలో సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ రాష్ట్రంలోనే నంబర్ వన్ అని ఎస్సీ, ఎస్టీ చైర్మన్ బక్కి వెంకటయ్య పేర్కొన్నారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ లో ల్యాండ్, సర్వీస్, అట్రాసిటీస్ పై నిర్వహించిన సమీక్ష చేశారు. జిల్లాలో కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవర్ పనితీరును చైర్మన్ కొనియాడారు. సమీక్ష అనంతరం జిల్లా కలెక్టర్ తేజస్ ను ఘనంగా సన్మానించారు.