సూర్యాపేటలోని కేజీవీబీ మైనారిటీ బాలికల గురుకుల పాఠశాలను తనిఖీ పర్యాటక శాఖ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర విద్యా కమిషన్ మెంబర్ చారుకొండ వెంకటేశ్వర్లు ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. భోజనశాలను పరిశీలించారు. పాఠశాల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు ఉన్నారు.