సూర్యాపేట: ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి

69చూసినవారు
సూర్యాపేట: ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి
నిరుపేదలు ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకొని తమ ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకోవాలని సువెన్ ఫార్మా హెడ్ ఎం. రమేష్ బాబు అన్నారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని భరోసా సెంటర్లో సువెన్ ఫార్మా ఆధ్వర్యంలో మెడికవర్ ఆసుపత్రి వైద్య బృందంచే ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. పెద్ద ఆసుపత్రులకు వెళ్ళే అవసరం లేకుండా ఉచిత వైద్య శిభిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్