Top 10 viral news 🔥

రేపు ఇంటర్ ఫలితాలు.. భయంతో విద్యార్ధి సూసైడ్
ఏపీలోని నంద్యాల జిల్లాలో విషాద ఘటన జరిగింది. పరీక్షల్లో ఫెయిల్ అవుతానేమోనన్న భయంతో ఇంటర్ ఫస్టియర్ విద్యార్థి ఉరేసుకుని చనిపోయాడు. మృతుడు అయ్యవారి కోడూరుకి చెందిన బిజ్జం సుధీశ్వర్ రెడ్డి(18)గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఏపీలో రేపు ఇంటర్ ఫలితాలు విడుదల కానుండగా.. తెలంగాణలో ఈ నెలాఖరుకు ఫలితాలు రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది.
NOTE: పరీక్ష ఫెయిల్ అయితే మళ్ళి రాసి పాస్ అవ్వొచ్చు.. కానీ ప్రాణాలు తీసుకోవద్దు.