సూర్య భగవానుని ఆశీస్సులు ప్రజలందరిపై వుండాలని వేదాంత భజనమందిరం చైర్మన్ రాచర్ల వెంకటేశ్వర రావు అన్నారు. సోమవారం నాడు బొడ్రాయి బజార్ వేదాంత భజన మందిరం వద్ద రథసప్తమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సూర్యప్రభ వాహనంపై శ్రీ రామచంద్ర స్వామిని పూలతో అలంకరించి, పూజలు నిర్వహించి, ఆదిత్య హ్ర్రదయం స్తోత్రం పఠించారు. సూర్య భగవానుకు నైవేద్యం సమర్పించి, భక్తులకు ప్రసాదం అందజేశారు.