
జూన్ 8న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి శుభాంశు శుక్లా
భారత సంతతికి చెందిన వ్యోమగామి శుభాంశు శుక్లా జూన్ 8న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లనున్నారు. మరో ముగ్గురు వ్యోమగాములతో కలిసి ఆక్సియం-4 మిషన్‌లో ఆయన పైలట్‌గా వ్యవహరించనున్నారు. ఈ మిషన్ అమెరికాలోని ఫ్లోరిడాలోని కెన్నడీ స్పేస్ స్టేషన్ నుంచి ప్రారంభంకానుంది. మొదట మే 29న ప్రయోగించాల్సిన ఈ ప్రయాణాన్ని సాంకేతిక కారణాలతో జూన్ 8కి వాయిదా వేశారు.