సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎం ఎస్ రెడ్డి పాఠశాలలో విద్యార్థులు ప్రయోగాత్మకంగా సైన్స్ ప్రయోగాలను ప్రదర్శించి ఎడ్యుకేషన్ ఫెయిర్ ను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలకు చెందిన విద్యార్థులు సుమారు 70 ప్రదర్శనలను ప్రయోగాత్మకంగా ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ స్వర్ణలత, ప్రిన్సిపాల్ రజిని, ఆర్ కె ఎల్ కె కళాశాల ప్రిన్సిపాల్ త్యాగరాజు, మాథ్స్ సీనియర్ లెక్చరర్ భరత్ ఉన్నారు.