తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం దెబ్బతీసే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహం నమూనా ఉందని తెలంగాణ జై గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, పంతంగి వీరస్వామి గౌడ్ అన్నారు. సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజల మనోభావాలకు విరుద్ధంగా తెలంగాణ తల్లి విగ్రహరూపు రేఖలను మార్చడం సరికాదన్నారు.