బ్రైట్ ఫ్యూచర్ ఫౌండేషన్ ఫౌండర్ రియల్ ఎస్టేట్ బిల్డర్ కెక్కిరేణి శివకుమార్ గౌడ్ మరణం బాధాకరమని జై గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పంతంగి వీరస్వామి అన్నారు. గురువారం సూర్యాపేటలోని తాళ్లగడ్డలో శివకుమార్ నివాసానికి చేరుకొని ఆయన పార్థివదేహనికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ చిన్నతనంలోనే ప్రజలకు సేవ చేసేందుకు స్వచ్ఛంద సంస్థ స్థాపించి కరోనాకాలంలో సరుకులు పంపిణీ చేశారని గుర్తు చేశారు.