మాల బంటి కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోట గోపి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం సూర్యాపేటలో బంటి కుటుంబాన్ని పరామర్శకు వచ్చిన ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యకు వినతి పత్రం అందజేశారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి మూడు నెలల్లో నిందితులకు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు ఉన్నారు.