సూర్యాపేట: వికలాంగుల సమస్యలు పరిష్కరించాలి

69చూసినవారు
సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం గుంపుల లో భారత వికలాంగుల హక్కుల సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ అధ్యక్షతన మంగళ వారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్నికలకు ముందు వికలాంగులకు ఇచ్చిన హామీలు రాజకీయ రిజర్వేషన్లు, పింఛన్ పెంపు అమలు చేయాలన్నారు. ఈ సమావేశంలో సంఘం జిల్లా సీనియర్ నాయకులు ఉప్పునూతల నరసయ్య, సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మున్న, మధుయాదవ్ పాల్గొన్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్