సూర్యాపేట జిల్లా టిఆర్ఎస్ నాయకులు, జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్షుడు గండూరి కృపాకర్ జన్మదిన వేడుకలు శనివారం జిల్లా కేంద్రంలోని 45వ వార్డు విద్యానగర్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనను శాలువాలతో సన్మానించి, పుష్ప గుచ్చాలు అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ సభ్యులు నల్లపాటి రమేష్, వుల్లి రామాచారి, యామ సందీప్, నల్లపాటి ప్రశాంత్, శ్యామ్ కూరెళ్ళ, తదితరులు పాల్గొన్నారు.