ఆత్మకూర్ (ఎస్) లో ఆరోగ్య కేంద్రం ఆకస్మిక తనిఖీ

73చూసినవారు
ఆత్మకూర్ (ఎస్) లో ఆరోగ్య కేంద్రం ఆకస్మిక తనిఖీ
సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ ఎస్ గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, రెవెన్యూ సదస్సును జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవర్ మంగళవారం ఆకస్మికంగా పరిశీలించారు. ఆసుపత్రిలోని ఓపి రిజిస్టర్ను, ఏ ఎన్ సి రీజిస్టర్ లను పరిశీలించారు. ఈడిడి రిపోర్టు పరిశీలించి ఈ వారంలో జరిగే ప్రసవాలు వివరాలను ఏఎన్ఎం సంద్యను అడిగి తెలుసుకున్నారు. ప్రసవాలకు దగ్గరలో ఉన్న పేషెంట్లను వారి డెలివరీ వివరాలు నమోదు చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్