ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించిన సందర్భంగా సూర్యాపేట పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వరరావు మాట్లాడుతూ అవినీతికి వ్యతిరేకంగా ఏర్పాటైన ఆమ్ఆద్మీ పార్టీని అవినీతికి పాల్పడినందుకే ఓడించారని, ప్రజలు అవినీతిని సహించరు అనే విషయం మరోసారి స్పష్టమైందన్నారు.