సూర్యాపేట జిల్లా విశ్వహిందూ పరిషత్ శాఖ ఆధ్వర్యంలో స్థానిక శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో విశ్వహిందూ పరిషత్ క్యాలెండర్ ను విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు కారింగుల ఉపేందర్, ప్రధాన అర్చకులు శ్రీ ధరూరి రామానుజాచార్యులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ పట్టణ ఉపాధ్యక్షులు శ్రీ బైరు విజయకృష్ణ, , పట్టణ బజరంగ్దళ్ సంయోజక్ శ్రీ పున్నం సందీప్, హనుమాన్ భక్తులందరూ పాల్గొన్నారు.