సూర్యాపేట రూరల్ మున్సిపల్ పరిధిలోని పిల్లలమర్రి శివాలయాల్లో కార్తిక మాసాన్ని పురస్కరించుకుని శనివారం స్టేట్ ఫైనాన్స్ కమిషన్ జాయింట్ సెక్రటరీ దాచవరం సోమేశ్వర విశ్వనాధ శర్మ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వారికి అర్చకులు మునగలేటి సంతోష్ శర్మ తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఏటా కార్తీక మాసంలో పిల్లలమర్రి శివాలయాల్లో పూజలు చేయడం ఆనవాయితీగా వస్తుందన్నారు.