ప్రభుత్వ పాఠశాల లను బలోపేతం చేస్తామని జిల్లా కలెక్టర్ తేజస్ అన్నారు. సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని కుడకుడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలలను ఆయన శుక్రవారం ఆకస్మికంగా సందర్శించారు. ముందుగా అడ్మిషన్ రిజిస్టర్‌లు, హాజరు రిజిస్టర్‌లు క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం ప్రాథమిక పాఠశాలలో ఒకటో తరగతిలో చేరిన విద్యార్థులతో అక్షరాభాస్యం చేయించి అక్షరాలు దిద్దించారు.