సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో శనివారం ప్రపంచ ధ్యాన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ ధ్యాన శిక్షణ కార్యక్రమం నందు 250 మంది సిబ్బంది పాల్గొని ధ్యానం చేశారు. ఈ సంధర్బంగా అదనపల్లి నాగేశ్వరరావు మాట్లాడుతూ శారీరక దృఢత్వంతో పాటు మానసిక దృఢత్వం కూడా కలిగి ఉండాలని సిబ్బంది ఒత్తిడిని అధిగమించడానికి వీలైనప్పుడు ధ్యానం యోగా లాంటి కార్యక్రమాలు చేయాలని సూచించారు. ఈ కార్యాక్రమంలో డీఎస్పీ నరసింహచారి ఉన్నారు.