సూర్యాపేట జిల్లాలో ఉద్రిక్తత

16చూసినవారు
సూర్యాపేట జిల్లాలో ఉద్రిక్తత
సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం జానకీనగర్ తండాలో శుక్రవారం సర్వే నేపథ్యంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. భూమిలోకి వెళ్లే రోడ్డును కొలవడానికి వచ్చిన రెవెన్యూ అధికారులను ఓ వర్గం అడ్డుకోగా, మరోవర్గం అభ్యంతరం తెలుపుతూ ఘర్షణకు దిగింది. ఈ క్రమంలో ఓ వ్యక్తి సర్వే ఆపాలని డిమాండ్ చేస్తూ తన ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఎమ్మార్వో కారును అడ్డగించాడు. దీంతో గ్రామస్థులు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పెద్దఎత్తున పోలీసు బలగాలను అక్కడ మోహరించారు. సర్వే చేపట్టాలని మరో వర్గం ఆందోళన కొనసాగిస్తోంది.

సంబంధిత పోస్ట్