తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు బిమిరెడ్డి నర్సింహరెడ్డి చేసిన సాయుధ పోరాట చరిత్ర మరువలేనిదని సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు, తెలంగాణ జై గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు పంతoగి వీరస్వామి గౌడ్ అన్నారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోనీ 60ఫీట్ల రోడ్డు లో భీమిరెడ్డి నర్సింహారెడ్డి 17 వ వర్ధంతిని పురస్కరించుకొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి మాట్లాడారు.